పుష్ప2 టీజర్.. మామూలు ప్లాన్ కాదుగా!
వచ్చే నెల ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ పుష్ప2 నుంచి అప్డేట్ ఆశించడం సహజం. కానీ ఈ సారి ఫ్యాన్స్ అప్డేట్ తో వదలట్లేదు. పోస్టర్‌తో పాటు ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చేందుకు టీజర్ ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు సుకుమార్. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ నుంచి చిన్న చిన్న డైలాగులను తీసుకుని దానితో పాటూ ప్రత్యేకంగా షూట్ చేసిన ఫుటేజ్ ని కూడా ఇందులో యాడ్ చేయనున్నారట. ఈ వీడియో రిలీజ్ చేయడం వెనుక పెద్ద స్కెచ్ యే వేసింది చిత్ర యూనిట్. ఖర్చు ఎక్కువైనా సరే ఎక్కడా తగ్గేదేలే అంటూ వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. అసలే వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డితో వచ్చిన లాభాలు వాళ్లను మామూలు ఆనందంలో ఉంచట్లేదు.
అమిగోస్ ఫ్లాప్ అయినా సరే దాన్ని సీరియస్ గా తీసుకోట్లేదు చిత్ర నిర్మాతలు. ఒకసారి పుష్ప2 నుంచి విజువల్స్ బయటకు వచ్చాయి అంటే దాన్ని బేస్ చేసుకుని నార్త్ నుంచి పుష్ప2 కు విపరీతమైన బిజినెస్ జరిగే అవకాశాలుంటాయి. ఇప్పటి వరకు పుష్ప2 హిందీ వెర్షన్‌కు సంబంధించిన డీల్స్ ఏవీ ఫైనల్ చేయలేదు. రిలీజ్ టైమ్‌కు వచ్చే బజ్ ను బట్టి రేట్ నిర్ణయించనున్నారు.













