పుష్ప కోసం సుకుమార్ తెలివైన ప్లాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. వాస్తవానికి పుష్ప2ని ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ షూటింగ్ లేటవడం వల్ల సినిమాను డిసెంబర్ కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
పుష్ప2కు సంబంధించిన భారీ యాక్షన్ సీన్ ను సుకుమార్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశాడట. దాదాపు 15 రోజుల పాటూ ఈ సీన్ కు షూటింగ్ చేయాల్సి వస్తుందట. అన్ని రోజుల పాటూ అందరి డేట్స్ కావాలంటే ఎంతో ఖర్చవుతుదని భావించి ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ముందుగా డమ్మీ ఆర్టిస్టులతో షూట్ చేయనున్నాడట.
షూట్ చేసిన ఆ డమ్మీ యాక్షన్ సీన్ ఎలా వచ్చిందో చూసి అందులోని లోపాలను గుర్తించి ఆ తర్వాత రియల్ నటీనటులతో షూటింగ్ కు వెళ్లనున్నాడట. పుష్ప2లో కీలకమైన ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం సుకుమార్ వేసిన ప్లాన్ భలే ఉందంటూ ఈ వార్త తెలిసివారంతా అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాడు కాబట్టే తన సినిమాలు మంచి ఫలితాలను అందుకుంటాయి.













