Jatadhara: జటాధర క్లాస్ మాస్ అందరికీ థ్రిల్ ఇచ్చే సినిమా. 100% బ్లాక్ బస్టర్ – హీరో సుధీర్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన నవ దళపతి సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధర గ్రిప్పింగ్ & స్పైన్-చిల్లింగ్ ట్రైలర్
నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ జటాధార (Jatadhara) నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
పురాతన కాలంలో సంపదను దాచడానికి “పిశాచ బంధనం” అనే ఘోర మంత్రాన్ని ఉపయోగించేవారు. ఇది ఆ సంపదను కాపాడేందుకు రాక్షసాత్మల్ని ఆహ్వానించే మంత్రం. భూతాలు లేవని నిరూపించాలనుకునే ఒక స్కెప్టిక్ ఘోస్ట్ హంటర్, ఒకరి లోభం కారణంగా ఈ బంధనాన్ని భంగం చేస్తాడు. దీంతో “ధన పిశాచ” అనే శాపగ్రస్త దయ్యం మేల్కొంటుంది. ఒక చిన్నారి బలి జరగబోతోందన్న భయంకర కలతో, ఆ హంటర్ ఒక దుష్ట శక్తీని అడ్డుకోవడానికి బయలుదేరుతాడు. ఈ అల్లకల్లోలానికి అర్థం కాని దశలో ప్రారంభమవుతుంది శివుడు, సృష్టి .. వినాశనానికి ప్రతిరూపమైన ఆ దివ్య శక్తి.
ట్రైలర్‌లో భూతపిశాచాలు, శాపగ్రస్త ఆలయాలు, ఆధ్యాత్మిక యుద్ధాలు కళ్ళు తిప్పుకోలేని విధంగా చూపించారు. ముఖ్యంగా సుధీర్ బాబు నేలపై వున్న రక్తం త్రాగుతూ తపస్సులోకి వెళ్ళే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించింది. పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా వుంది.
సోనాక్షి సిన్హా ధన పిశాచిగా అదరగొట్టింది. అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ పాత్రలు ఆసక్తి రేకెత్తిస్తున్నారు.
వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ ఎలిమెంట్స్ తో పాటు భారతీయ పురాణ వైభవాన్ని అద్భుతంగా చూపిస్తున్నాయి. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా వుంది. రాజీవ్ రాజ్ సంగీతం ప్రతి రీచువల్ సీన్‌లోనూ టెన్షన్, థ్రిల్‌ని పెంచింది.
జీ స్టూడియోస్ ,ప్రేరణ అరోరా (Ess Kay Gee ఎంటర్‌టైన్‌మెంట్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, డివోషనల్ ఫాంటసీ హారర్ జానర్ ని రిడిఫైన్ చేసేలా వుంది. ట్రైలర్ సినిమాపై బజ్ మరింతగా పెంచింది. సినిమా నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ట్రైలర్ లాంచ్ చేసిన మహేష్ బాబు గారికి థాంక్యూ. చిన్నప్పుడు విన్న ఓ స్త్రీ రేపు రా, లంకె బిందెలు కదలి విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం.వెంకట్ వచ్చి కథ చెప్పినప్పుడు అంతేగా థ్రిల్ అనిపించింది. ఆడియన్స్ కూడా థియేటర్స్ లో అదే త్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా అద్భుతంగా రావడానికి కారణమైన టీమ్ అందరికీ థాంక్యు. సోనాక్షి చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకెవరు కూడా మ్యాచ్ చేయలేరు. ధన పిశాచి పవర్ ఫుల్ రోల్. సోనాక్షి మరింత పవర్ ని యాడ్ చేశారు. డైరెక్టర్ వెంకట్ అభిషేక్ కి ఇది ఫెంటాస్టిక్ డెబ్యూ. క్లాస్ మాస్ అందరికీ కనెక్ట్ స్క్రిప్ట్ ఇది. పక్కగా తెలుగు హిందీలో రిలీజ్ అవుతుంది. శిల్పా క్యారెక్టర్ ఇందులో చూస్తే భయమేస్తుంది. సినిమా ఒక దమ్ బిర్యానిలా తయారైంది. ఆడియన్స్ మనీ టైం కి వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సినిమా 100% బ్లాక్ బస్టర్. జటాధర కూడా 100% బ్లాక్ బస్టర్. నవంబర్ 7న ఇంట్లో ఉన్న అందరిని తీసుకెళ్లండి. ఈ సినిమా చూసి వాళ్లంతా మిమ్మల్ని పొగుడుతారు. థాంక్యూ
హీరోయిన్ సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా, చాలా స్పెషల్. ఇంత అద్భుతమైన టీం తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సపోర్ట్ కు థాంక్యూ. జటాధర సినిమాని తప్పకుండా థియేటర్స్ చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. సుదీర్ బాబు గారితో కలిసి నటించడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ధన పిశాచి లాంటి రోల్ ఇప్పటివరకూ చేయలేదు. డైరెక్టర్స్ కి థాంక్యూ. ఒక యాక్టర్ గా ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మ నా ఫస్ట్ తెలుగు రిలీజ్. మళ్లీ జటాధరతో రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు మీ ప్రేమ సపోర్ట్ ని అందిస్తారని కోరుకుంటున్నాను. మహేష్ బాబు గారు ట్రైలర్ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇండస్ట్రీలోకి మళ్ళీ వెల్కం చేశారు. అది మాకు చాలా స్పెషల్.
నిర్మాత ఉమేష్ మాట్లాడుతూ… తెలుగు ఇండస్ట్రీ మాకు చాలా స్పెషల్. ట్రైలర్ ఇక్కడ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సపోర్ట్ కి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాము.
నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు. తెలుగు హిందీలో ఈ సినిమాని చేసాము. మాకు సపోర్ట్ చేసిన జి స్టూడియోస్ కి కృతజ్ఞతలు. సుధీర్ బాబు గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన వల్లే ఈ సినిమా తెలుగులో చేయగలిగాము. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. ఇది మాకు చాలా పెద్ద సపోర్టు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
నిర్మాత శివిన్ నారంగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సుధీర్ బాబు గారి సినిమాలంటే చాలా ఇష్టం. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుదీర్ బాబు గారికి థాంక్యూ. ఇది బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
దర్శకులు వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. సినిమా ట్రైలర్ కి మించి ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాం. మీరందరూ గట్టిగా ఎంజాయ్ చేస్తారు. ఇది 100% గ్యారంటీ. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుదీర్ బాబు గారికి నిర్మాతలకి థాంక్యూ సో మచ్. ఈ ఏడాదికి ఇది ఫెంటాస్టిక్ ఫిల్మ్ అవుతుందని నమ్మకం ఉంది.