Sudheer Babu: మహేష్ రియాక్షన్ చూడాలనుంది
సూపర్ స్టార్ కృష్ణ(Krishna) అల్లుడిగా, మహేష్ బాబు(mahesh babu)కు బావగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు(sudheer Babu), ఆ తర్వాత సొంతంగా సినిమాలు చేయడానికి ప్రయత్తిస్తూ, సోలో ప్రయత్నాలు చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అయి, కెరీర్లో ముందుకెళ్లాలని అనుకున్నారు. సుధీర్ బాబు హీరో అవకముందే మహేష్ చెల్లితో పెళ్లి జరిగింది. వరసకి మహేష్, సుధీర్ బావా బామ్మర్ది అవుతారు.
సుధీర్ బాబు కు సంబంధించిన ఏ సినిమా రిలీజవుతున్నా మహేష్ ఆ సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తారు. సుధీర్ సినిమాలను మహేష్ ఎలా అయితే సపోర్ట్ చేస్తారో, సుధీర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా మహేష్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగి కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు మీడియా ప్రతినిధులు. అందులో భాగంగానే ఇప్పుడు జటాధర(jatadhara) ప్రమోషన్స్ లో మహేష్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
మహేష్ ను మీరు బావ అనే పిలుస్తారా అని అడగ్గా, దానికి సుధీర్ రెస్పాండ్ అవుతూ, తాను మహేష్ అనే పిలుస్తానని, మహేష్ ను తాను ఇప్పటివరకు బావ అని పిలవలేదని, అలా పిలిస్తే బావుంటుందనిపిస్తుందని, కానీ పిలవడానికి సిగ్గేస్తుందని, ఎప్పుడైనా మహేష్ ను బావ అని పిలిచి అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని సుధీర్ చెప్పాడు.







