‘రాధే శ్యామ్’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కి ఛాన్స్ ఉందా?
అలవైకుంఠపురంలో…. చిత్రంతో టాలీవుడ్ సంగీత ప్రపంచం లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. మొదటి నుండి యూత్ ని టార్గెట్ చేస్తూ అతను అందింస్తున్న పాటలకు తొదరగా కనెక్ట్ అవుతున్నారు కుర్రకారు. తన కెరీర్ లో ఎన్నో గొప్ప పాటలు అందించిన అలవైకుంఠపురంలో….పాటలు అంతర్జాతీయంగా అతనికి గుర్తింపునిచ్చాయి. విదేశీ సెలబ్రిటీస్ సైతం స్టెప్స్ వేసిన అతని పాటలకు సోషల్ మీడియా లో రికార్డు స్థాయి లో వ్యూయర్ షిప్ వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే…యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ చూసిన తరువాత ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ మినహాయించి సినిమాకి సంభందించిన ప్రైమ్ టెక్నిషియన్స్ అందరు కంఫర్మ్ అయ్యారు. ఇప్పటివరకు చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి అయితే తాజాగా థమన్ ను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వార్త గాని నిజమైతే థమన్ కెరీర్ కి ‘రాధే శ్యామ్’ ఓ మలుపు నిస్తుందని వేచి చూదామా?













