రాజమౌళికి పాకిస్తాన్ ఆహ్వానం!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తో దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. భారత్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాహుబలి. ది కంక్లూజన్ ఇతర దేశాల్లో కూడా విడుదలైన మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల జపాన్‌లోనూ సత్తా చాటింది. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. పాకిస్తాన్లో జరిగే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం రాజమౌళికి దక్కింది. ఈ విషయాన్ని రాజమౌళి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఎన్నో దేశాల్లో పర్యటించే అవకాశం నాకు బాహుబలి సినిమా కల్పించింది. వాటన్నంటి కంటే మించి ఇప్పుడు పాకిస్తాన్లో పర్యటించబోతున్నాం. కరాచీలో జరిగే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని రాజమౌళి తెలిపారు.













