వర్మ మీద ఆమెకు ఉన్న లవ్వే దానికి కారణమట!
రామ్‌గోపాల్‌వర్మ డైరెక్ట్ చేసిన `పవర్‌స్టార్` ఈనెల 25న విడుదలవుతున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్ అభిమానులు వర్మపై సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయినా వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో, పవర్‌స్టార్ సినిమా రిలీజ్‌కి ఎలాంటి ఆటంకం ఏర్పడుతుందో చూడాలి. ఇదిలా ఉంటే, రామ్‌గోపాల్‌వర్మకు వ్యతిరేకంగా పరాన్నజీవి అనే సినిమాను పవన్‌కల్యాణ్ అభిమానులు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో షకలక శంకర్… వర్మ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీరెడ్డి ఓ కీలక పాత్ర పోషిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా వివాదాలకు దూరంగా, హైదరాబాద్‌కి దూరంగా చెన్నయ్‌లో ఉంటున్న శ్రీరెడ్డి దీని గురించి స్పందించింది. పరాన్నజీవి సినిమాలో తాను నటిస్తున్నానని వస్తున్న వార్తలను ఖండించింది. వర్మను శ్రీరెడ్డి ప్రేమిస్తున్న కారణంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. వర్మ, శ్రీరెడ్డి రిలేషన్ గురించి అందరికీ తెలిసిందేనని, ఇందులో రహస్యం ఏముందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల విడుదలైన పవర్‌స్టార్ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో వర్మకు శుభాకాంక్షలు తెలియజేసింది శ్రీరెడ్డి.
పరాన్నజీవి సినిమాలో తనను నటింపజేసేందుకు చాలా ఒత్తిడి తెచ్చారని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తెలియజేసింది. ఈ సినిమాలో నటిస్తే బాగా డబ్బు ముట్టచెబుతామని ఆశపెట్టారని, అయితే డబ్బు కోసం నచ్చినవారితో రిలేషన్ పాడు చేసుకునేంత పిచ్చిదాన్ని కాదని తెలిపింది శ్రీరెడ్డి. ఈ మాటలు ఆమె నోటివెంట రావడానికి కారణం వర్మపై ఉన్న ప్రేమేనని ఆమె గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత కేవలం వర్మ సినిమా కోసం మళ్లీ వార్తల్లోకి వచ్చింది శ్రీరెడ్డి.













