Sree Leela: ఏజెంట్ గా శ్రీలీల

పెళ్లి సందడి2(Pelli sandadi2) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల(sreeleela) ఆ తర్వాత ధమాకా సినిమా చేసింది. ధమాకా(dhamaka) తర్వాత శ్రీలీల కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా అయింది. వరుస పెట్టి సినిమాలను ఒప్పుకుని వాటిని పూర్తి చేస్తున్న శ్రీలీల ఇప్పటికీ పలు సినిమాలతో బిజీగా ఉంటూ టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
పాన్ ఇండియా లెవెల్ లో బిజీగా ఉన్న శ్రీలీల నుంచి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఓ క్రేజీ పోస్టర్ లో శ్రీలీల నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించగా, శ్రీలీల ఏజెంట్ మిర్చి(agent mirchi) లా కనిపించనుంది. ఈ పోస్టర్ లో శ్రీలీల ఏజెంట్ లుక్ లో చాలా కొత్త గా కనిపించగా, పోస్టర్ లో లీల లుక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే మరి ఇది కొత్త సినిమానా లేక ఏదైనా షో కోసమా అనేది తెలియాల్సి ఉంది.
దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు అక్టోబర్ 19న రివీల్ చేయనున్నట్టు కూడా శ్రీలీల హింట్ ఇచ్చింది. అయితే శ్రీలీల చేయబోతున్న మరో బాలీవుడ్ ప్రాజెక్టు ఇది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సింది. కాగా, శ్రీలీల చేతిలో ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) సినిమా ఉన్న సంగతి తెలిసిందే.