వెంకీ హీరోయిన్‌తో బాలయ్య
ఈ మధ్య టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చాలా సినిమాలు హీరోయిన్ ను ఫిక్స్ చేయకుండానే షూటింగ్ కు వెళ్తున్నాయి. నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్, మెగాస్టార్ కొత్త సినిమా విశ్వంభర సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. వీటితో పాటూ నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ ఎవరన్నది అనౌన్స్ చేయకుండానే మేకర్స్ షూటింగ్ కు వెళ్లారు.
ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరుపుకుంది. అఫీషియల్ గా చిత్ర యూనిట్ నుంచి అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఈ సినిమాలో ఊర్వశీ రౌతెలా నటిస్తున్నట్లు తన ఇన్‌స్టా పోస్ట్ ల ద్వారా అమ్మడు తెలిపింది. ఇక మరో హీరోయిన్ గా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా వెంకటేష్ పక్కన సైంధవ్ లో నటించిన ఈ భామ, ఆ సినిమాతో హిట్ అందుకోకపోయినప్పటికీ, సీనియర్ హీరో అయిన వెంకీ పక్కన బాగానే సెట్ అయిందనే ప్రశంస మాత్రం అందుకుంది. ఈ కారణంతోనే బాలయ్య పక్కన ఈమెను ఎంపిక చేశారు. బాలయ్య మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ పెద్ద సినిమా కాబట్టి రెమ్యూనరేషన్ మాత్రం బాగానే అందుకునే అవకాశముంది.













