War2: ఎన్టీఆర్, హృతిక్ స్పెషల్ సాంగ్ పై క్రేజీ అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న సినిమా వార్2(War2). అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) నటిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చేస్తున్నాడు. ఆగస్ట్ 14న వార్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన సినిమా కావడంతో వార్2 పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని కొందరంటుంటే మరికొందరు ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ పై ఓ డ్యాన్స్ నెంబర్ ఉంటుందంటున్నారు. అటు హృతిక్ రోషన్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా మంచి డ్యాన్సర్లు అవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సాంగ్ ఎలా ఉంటుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
వార్2 లో ఎన్టీఆర్- హృతిక్ మధ్య ఓ డ్యాన్స్ నెంబర్ ఉండగా, ఆ సాంగ్ షూటింగ్ ను ఇవాళ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా యష్ రాజ్ స్టూడియోస్(Yash raj studios) లో దీని కోసం రిహార్సల్స్ జరిగాయని, ఇవాళ ఇద్దరి పై ఆ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు సమాచారం. నాటు నాటు(Naatu Naatu) సాంగ్ కు ఏ మాత్రం తీసిపోకుండా మేకర్స్ ఈ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారట. మరి ఈ సాంగ్ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.