Sonakshi Sinha: కెరీర్లో కష్టపడ్డ పాత్ర అదే!
టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సుధీర్ బాబు(sudheer babu) కూడా ఒకరు. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తున్న సుధీర్ బాబు తాజాగా జటాధర(jatadhara) అనే సినిమాలో నటించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జటాధర నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా(sonakshi sinha) హీరోయిన్ గా నటిస్తోంది.
సోనాక్షి నటిస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే. మిథికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జటాధరలో తన పాత్ర గురించి సోనాక్షి వెల్లడించింది. జటాధర కోసం తానెంతో కష్టపడాల్సి వచ్చిందని, ఇప్పటివరకు తాను ఎన్నో సినిమాల్లో నటించానని, కానీ తన కెరీర్లోనే ఈ సినిమాలో చేసిన పాత్ర ఫిజికల్ గా తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని పేర్కొంది.
ఈ మూవీ షూటింగ్ కు వెళ్లడానికి రెడీ అవడం కోసం తనకు ప్రతీ రోజూ మూడు గంటలు పట్టేదని, షూటింగ్ కోసం 50 కిలోల నగల్ని ధరించాల్సి వచ్చేదని సోనాక్షి తెలిపింది. అంతేకాదు, 50 కిలోల నగలు కదలకుండా ఉండేందుకు వాటిని తన శరీరానికి కుట్టించుకున్నట్టు ఆమె పేర్కొంది. యాక్షన్ సీన్స్ లో కూడా తాను ఆ భారీ బరువున్న నగలతోనే ఉండాల్సి వచ్చేదని, అయినప్పటికీ సెట్స్ లో ఉన్న వాళ్లంతా తనను బాగా చూసుకోవడం వల్ల ఆ క్యారెక్టర్ ను ఈజీగా చేయగలిగానని సోనాక్షి చెప్పింది.







