Sneha: ఆ కోలీవుడ్ హీరో అంటే ఇష్టమంటున్న స్నేహ

సౌత్ హీరోయిన్ స్నేహ(sneha) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన స్నేహ అంటే ఇష్టపడని వారుండరు. పక్కింటమ్మాయిలా కనిపిస్తూ, చూడటానికి ఎంతో చక్కగా కనిపించడంతో పాటూ ఎంతో మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది స్నేహ. తొలి వలపు(tholi valapu) అనే సినిమాతో స్నేహ టాలీవుడ్ కు పరిచయమైంది.
ఆ తర్వాత ప్రియమైన నీకు(priyamaina neeku), హనుమాన్ జంక్షన్(hanuman junction), శ్రీ రామదాసు(sri ramadasu), సంక్రాంతి(Sankranthi) లాంటి ఎన్నో సినిమాలతో తనదైన నటనతో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అయితే స్నేహ ప్రస్తుతం సహాయక పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి(S/o Satyamurthy) సినిమాలో ఉపేంద్ర(Upendra) భార్యగా నటించి మెప్పించింది స్నేహ.
వినయ విధేయ రామ(Vinaya Vidheya Rama)లో రామ్ చరణ్(Ram Charan) కు వదిన పాత్రలో మెరిసింది. రీసెంట్ గా డ్రాగన్(Dragon) సినిమాలో డాక్టర్ లో, గోట్(GOAT) సినిమాలో విజయ్(Vijay) కు భార్య గా నటించి మెప్పించిన స్నేహ, తమిళంలో కూడా పలువురు స్టార్లతో కలిసి నటించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహకు మీ అభిమాన హీరో ఎవరని అడగ్గా వెంటనే అమ్మడు అజిత్(Ajith) పేరు చెప్పేసింది. తనకు అజిత్ అంటే ఎంతో ఇష్టమని స్నేహ తన మనసులోని మాటను బయటపెట్టింది.