Sivaraj kumar: కీమో చేయించుకుంటూ కూడా షూటింగుల్లో పాల్గొన్నా: శివ రాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Siva raj Kumar) కు కన్నడ ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైమ్ లో ఆయన సినిమాల నుంచి సడెన్ గా బ్రేక్ తీసుకున్నాడు. క్యాన్సర్ బారిన పడి సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాడు. ఇప్పుడిప్పుడే క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు.
అయితే తనకు క్యాన్సర్ ఉన్నట్టు గత ఏప్రిల్ లోనే తెలిసిందని, మూవీస్ తో బిజీగా ఉన్న టైమ్ లో క్యాన్సర్కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయని, కానీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగులతో బిజీగా ఉండటం వల్లే అలా జరిగిందేమో అనుకుని అక్కడి లోకల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నట్టు తెలిపాడు.
తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్ టెస్ట్ చేయించినట్టు తెలిపాడు. రిపోర్ట్స్ లో క్యాన్సర్ అని బయటపడ్డాక చాలా కంగారు పడ్డానని చెప్పిన శివన్న(Sivanna), కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఇచ్చిన సపోర్ట్, ధైర్యం వల్లే చికిత్స తీసుకున్నానని, కీమో చేయించుకుంటూ కూడా షూటింగ్ లో పాల్గొన్న రోజులున్నాయని ఆయన తెలిపాడు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ఆయన మార్చి 5నుంచి ఆర్సీ16(RC16) షూటింగ్ లో పాల్గొననున్నట్లు చెప్పాడు. రామ్ చరణ్(ram charan) సినిమాలో తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని శివన్న తెలిపాడు.













