శివ 143 ప్రీ రిలీజ్ వేడుక
సాగర్ శైలేష్ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం శివ 143. ఎఇషా అదరహ, కృతికా సింగ్ కథానాయికులు. రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 14వ తేదీ)న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత మాట్లాడుతూ నిర్మాతగా నేను నాకు ఇష్టమైన వాళ్లతో సినిమాలు తీసుకోవొచ్చు. ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. అది నా ఇష్టం. కానీ సినిమా విడుదల పంపిణీదారులు, ప్రేక్షకుల ఇష్టం. ఈ విషయం తెలీక చాలా మంది నిర్మాతలు నష్టపోతున్నారు. నేను ముందు చూపుతో ఆలోచించి సినిమాలు తీసుకున్నాను కాబట్టే నాకు ఎలాంటి అడ్డుంకులు ఎదురు కాలేదు. శైలేష్ ప్రతిభావంతుడు. చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు. ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు నేను పది చిత్రాలకు పనిచేశాను. కానీ రామసత్యనారాయణ వంద సినిమాలు తీసేశారు. అందుకే నా రాబోయే సినిమా విడుద బాధ్యత ఆయనకే అప్పగించా అన్నారు చిన్నికృష్ణ. ఈ కార్యక్రమంలో కల్వకుంట్లు తేజేశ్వరరావు, ఉప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.













