Devara2: దేవర2లో కోలీవుడ్ నటుడు?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా, కొరటాల శివ(koratala Siva) దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర(devara). రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆశించిన బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ను ఇవ్వకపోయినా హిట్ టాక్ నే తెచ్చుకుంది. దేవర సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే ఈ కథ చాలా పెద్దదని, దీన్ని ఒక సినిమాగా చెప్పలేకపోతున్నామని చెప్తూ దేవర2(devara2) కూడా ఉంటుందని చెప్పారు మేకర్స్.
అయితే దేవర కు ముందు మిక్డ్స్ టాక్ రావడం చూసి దేవర2 ఉండదని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా దేవర రిలీజై సంవత్సరం పూర్తైన సందర్భంగా దేవర2 కోసం వెయిట్ చేయమని చెప్తూ దేవరకు సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే డిసెంబర్ లో షూట్ మొదలవనుందని కూడా అంటున్నారు. అయితే దేవర2 స్క్రిప్ట్ లో కొరటాల చాలా మార్పులు చేశాడని తెలుస్తోంది.
అందులో భాగంగానే దేవర2లో ఓ తమిళ యాక్టర్ నటిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ నటుడు శింబు(simbhu). అతని కోసం కొరటాల ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేశాడని, శింబు పాత్రతో పాటూ దేవర2 కోసం కొరటాల కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను జోడించాడని సమాచారం. దేవర2లో జాన్వీ కపూర్(janhvi Kapoor) తో పాటూ మరో హీరోయిన్ కూడా కనిపించనుందని అంటున్నారు.