SIIMA13: దుబాయ్‌లో గ్రాండ్ గా జరగనున్న SIIMA – 13వ ఎడిషన్ బెస్ట్ అఫ్ సౌత్ ఇండియన్ సినిమా సెలబ్రేషన్స్

సౌత్ ఇండియన్ సినిమాకు అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకగా నిలిచిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది 13వ ఎడిషన్ కోసం దుబాయ్ కి తిరిగివచ్చింది. సంవత్సరానికోసారి ఎలాంటి బ్రేక్ లేకుండా సౌత్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్న ఏకైక అవార్డ్స్ ప్లాట్‌ఫారమ్‌గా SIIMA గుర్తింపు తెచ్చుకుంది.
దుబాయ్ SIIMAకి రెండో ఇల్లు లాంటిదే. అందుకే ఈ ఏడాది వేడుక మరింత అద్భుతంగా, భారీ స్థాయిలో జరగబోతోంది. స్టార్ హీరోలు, టెక్నీషియన్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఒకే వేదికపై కలుసుకోబోతున్నారు.
2025 SIIMAకి హాజరయ్యే స్టార్ సెలబ్రిటీలు:
కమల్ హాసన్, అల్లు అర్జున్, శివకార్తికేయన్, పృథ్విరాజ్, దుల్కర్ సల్మాన్, కార్తి, రష్మిక మందన్న, త్రిష, ఉన్నిముకుందన్, ఉపేంద్ర, దునియా విజయ్, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, పర్వతి తిరువోథు, తేజ సజ్జా .. ఎంతోమంది స్టార్‌లు, టెక్నీషియన్లు పాల్గొంటారు.
అవార్డ్స్‌తో పాటు స్టేజ్‌ను షేక్ చేయబోయే పెర్ఫార్మెన్సులు:
శ్రుతి హాసన్
శ్రీయా శరణ్
వేదిక
శిల్పా రావు
ఉర్వశి రౌతెలా
సానియా అయ్యప్పన్
అమృత అయ్యంగార్
B-Unique క్రూ డాన్స్ ట్రూప్
SIIMA చైర్‌పర్సన్ శ్రీమతి బ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ.. “SIIMA సౌత్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం, ప్రపంచస్థాయిలో నిరంతరం సౌత్ సినిమాను జరుపుకుంటూ వస్తున్న ఏకైక వేదికగా ఉండటం నాకు గర్వంగా ఉంది. దుబాయ్ ఎప్పుడూ మా రెండో ఇల్లు, ఈసారి కూడా అద్భుతమైన వేడుకతో తిరిగి రావడం ఆనందంగా ఉంది.
ఈ ఏడాది స్టేజ్‌పై పెర్ఫార్మ్ చేయబోతున్న శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. SIIMA నాకు ఎప్పుడూ చాలా ప్రత్యేకం. ఇది కేవలం అవార్డ్స్ ఫంక్షన్ కాదు, సినిమా పండుగ. మనందరం ఒక కుటుంబంలా కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. దుబాయ్‌లో తిరిగి ఫ్యాన్స్ ముందుకు రావడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ జర్నీ మరింత మ్యాజికల్‌గా ఉంటుంది.”
ఈవెంట్ తేదీలు
సెప్టెంబర్ 5, 2025 – తెలుగు & కన్నడ అవార్డ్స్ నైట్
సెప్టెంబర్ 6, 2025 – తమిళ & మలయాళ అవార్డ్స్ నైట్