అజయ్ దేవగణ్ కు జోడీగా శ్రియ
ఆర్ఆర్ఆర్ లో శ్రియ నటిస్తున్నారు. అయితే ఆమెది కథానాయిక పాత్ర కాదు, ప్రధాన పాత్ర. రాజమౌళి దర్వకత్వంలో ఆమెకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు ఛత్రపతి లో ప్రభాస్‌కు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్లో హిందీ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా శ్రియ కనిపించనున్నారు. హిందీ దృశ్యంలో వీరిద్దరూ జంటగా నటించారు. మల్లీ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో అజయ్ దేవగణ్, శ్రియపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. చిన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు.













