Shriya Reddy: సలార్ కోసం 60 పుషప్స్

తన గొప్ప యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి శ్రియా రెడ్డి(Shriya Reddy). సలార్(salaar), ఓజి(OG) సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న శ్రియా చేసిన పాత్రలకు ఎంతోమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అయితే శ్రియా రెడ్డి మంచి ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆమె ఫిట్‌నెస్ ను పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా మెచ్చుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి ఫిట్‌నెస్ తనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వెల్లడించింది. షూటింగు లో తాను షాట్ కు వెళ్లేముందు కొంత టైమ్ తీసుకుంటానని, ఆ టైమ్ లో రన్నింగ్ చేయడం లేదంటే చిన్న చిన్న వర్కవుట్స్ చేసి తర్వాత షాట్ కు వెళ్లడం తనకు అలవాటు అని, అలా చేసినప్పుడు తనకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పింది శ్రియా.
సలార్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా షాట్ కు వెళ్లే ప్రతీసారి 50 నుంచి 60 పుషప్స్ చేసి వెళ్లేదాన్ని అని, అలా చేయడం వల్ల తనకు కొత్త ఎనర్జీ రావడంతో పాటూ ఆ పాత్రలో తాను పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాననే ఫీలింగ్ వచ్చేదని, ఖాన్సార్ లో చాలా మంది మగవాళ్ల మధ్య నిలబడాల్సి వచ్చినప్పుడు తాను పవర్‌ఫుల్ గా కనిపించాలంటే లోపల నుంచి కాన్ఫిడెన్స్ రావాలని, పుషప్స్ చేయడం వల్లే తనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందని శ్రియా చెప్పడంతో ఆమె డెడికేషన్ కు అందరూ ఫిదా అవుతున్నారు.