మరో మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
యువ కథానాయకుడు శర్వానంద్ జోరు మీదున్నారు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం జాను, శ్రీకారం చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. జాను ఫిబ్రవరిలో వస్తోంది. వేసవిలో శ్రీకారం విడుదలవుతోంది. ఈలోగా మరో కథకీ పచ్చజెండా ఊపేశారు శర్వా. కిషోర్ తిరుమలతో ఆయన ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. నేను శైలజ, చిత్రలహరి చిత్రాలతో ఆకట్టుకున్నారు కిషోర్ తిరుమల. ఇప్పుడు రామ్‌తో రెడ్ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే శర్వాతో సినిమా మొదలెడతారని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తారు.













