శంకర్ దాదాను మళ్లీ ప్రేక్షకులు ఆదరిస్తారా?
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా చాలా సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేసి మంచి కలెక్షన్లను రాబట్టాయి. కానీ ఈ మధ్య మళ్లీ ఆ రీరిలీజ్ ల ట్రెండ్ బాగా నెమ్మదించింది. ఇలాంటి టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ ను రిలీజ్ కు రెడీ చేశారు.
నవంబర్ 4న ఈ సినిమాను గ్రాండ్ గా రీరిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా రీరిలీజ్ కు నవంబర్ 4 మంచి డేటే. ఆ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమీ రిలీజ్ అవడం లేదు. కీడా కోలా, పొలిమేర2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఆ సినిమాలేవీ హౌస్ ఫుల్స్ అయ్యే సినిమాలు కాదు.
కాబట్టి నవంబర్ 4న సినిమాను రీరిలీజ్ చేద్దామని మంచి ప్లానే చేసుకున్నప్పటికీ, పాత సినిమాలను మళ్లీ వచ్చి చూసే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో ఇప్పుడు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను రీరిలీజ్ చేసి ఏ మేరకు కలెక్షన్స్ తెస్తారనేది చూడాలి. ఇలాంటి సినిమాలు కనీసం ఏదైనా పండగ లేదా ఆయా హీరోల బర్త్ డే టైమ్ లో రిలీజ్ చేస్తే కనీసం మంచి కలెక్షన్స్ అయినా వస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.













