Satyadev: సలార్ చూస్తే మామూలైపోతా

టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోయి తనదైన శైలిలో ఆడియన్స్ ను మెప్పించల సత్యదేవ్(Satyadev), ప్రతీ పాత్రకీ కొత్తదనం చూపిస్తూ ఉంటాడు. రీసెంట్ గా కింగ్‌డమ్(kingodm) సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్, ఇప్పుడు అరేబియా కడలి(arabia kadali) అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన సత్యదేవ్ తనకు ఓ సినిమా వ్యసనంలా మారిపోయిందని చెప్పాడు. తన మనసు బాలేనప్పుడు సలార్(salaar) సినిమా చూస్తానని, అలా చూడటం వల్ల వెంటనే తన మైండ్ నార్మల్ అయిపోతుందని, బహుశా ఆ మూవీలోని మ్యూజిక్ వల్లనో, ఆ సినిమాలో ఉన్న ప్రభాస్(prabhas) వల్లనో, లేదంటే ఆ మూవీలోని పవర్‌ఫుల్ సీన్స్ వల్లనో తెలీదు కానీ సలార్ చూస్తే బాధ నుంచి బయటపడతానని, కారణం ఏదైనా సరే తనకు సలార్ ఓ వ్యసనంలా మారిందని సత్యదేవ్ చెప్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు కెజిఎఫ్(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కీలక పాత్రలో నటించగా శృతి హాసన్(shruthi Hassan) హీరోయిన్ గా నటించింది. 2023లో రిలీజైన సలార్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద నెక్ట్స్ లెవెల్ కలెక్షన్లను అందుకుంది.