సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు
మహేశ్ బాబు ఆర్మీ మేజర్‌గా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మడన్నా కథానాయిక. విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా వచ్చే జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అదే నెల 5వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక కాబోతుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని జీఎంబీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రూపొందుతోంది. అనిల్ రావిపూడి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు.













