కొత్త లుక్ తో మరో సారి హీరో గా సప్తగిరి చిత్రం ‘ఎయిట్’
తెలుగు ఇండస్ట్రీ లో హాస్య నటులు చాలా మట్టుకు హీరోలు అయినా వారే ఉన్నారు .. కాబట్టి సప్తరిని కూడా కామెడీ నటుడు నుండి మరోసారి హీరోగా అవతారం ఎత్తాడు. తన కామెడీ తో అందరిని ఆకట్టుకున్న సప్తగిరి హీరో తో కూడా అంతే అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు .. హాస్యనటుడు నుంచి కథానాయకుడిగా మారిన సప్తగిరి హీరోగా ఎయిట్ ఆనే సినిమాను చేస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఎయిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదల చేసిన పోస్టర్లో హీరో సప్తగిరి లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది.
ఎప్పుడు చేయని పాత్ర లో సప్తగిరి నటిస్తున్నట్లు తెలుస్తుంది .. బహుశా అభిమానులు కూడా ఇలాంటి లుక్‌లో సప్తగిరిని చూసుండరు. అంతలా పోస్టర్ ప్రేక్షకులని అట్ట్రాక్ట్ చేస్తోంది .. ఒకసారి పోస్టర్ ని గమనిస్తే వెనుక మంట, ఎడమచేతికి రక్తం, ఆ రక్తం చేతితోనే సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ చాలా సీరియస్ లుక్‌లో సప్తగిరి కనిపిస్తున్నారు. ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ కూడా చాలా హుందాగా ఉంది. థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కామెడీకి కూడా పెద్ద పీట వేశామని.. సప్తగిరి ఇమేజ్‌కు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అలాగే జనవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత వెల్లడించారు.
ఇక ఈ చిత్రానికి ఎన్.ఎస్. ప్రసు సంగీతం సమకూరుస్తున్నారు అలాగే నజీర్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.. కాగా పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి సప్తగిరి మంచి పేరు తెచ్చుకున్నారు .. అలాగే హీరోగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి, వజ్రకవచధర గోవింద వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే హీరోగా సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు సాధించలేకపోయారు .. మరి ఈ చిత్రం తనకి ఎంత పేరుని తీసుకు వస్తుందో వేచి చూడాలి.
సాంకేతిక బృందం: మ్యూజిక్: ఎన్.ఎస్. ప్రసు, సినిమాటోగ్రఫీ: నజీర్, ఎడిటింగ్: వంశీ, పీఆర్వో: వంశీ-శేఖర్, సహ నిర్మాత: ఖుషి, నిర్మాత: రిజ్వాన్, దర్శకత్వం: సూర్యాస్.













