Sankranthiki Vasthunnam: బాలీవుడ్ లో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్.. హీరో ఎవరంటే?

విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమా ఏ రేంజ్ సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని సూపర్‌హిట్ గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, రీజనల్ మూవీస్ లో మంచి కలెక్షన్లు అందుకున్న సినిమాగా నిలిచింది.
ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కు కెరీర్లో మంచి జోష్ ను కూడా తీసుకొచ్చింది. అలాంటి ఈ మూవీని ఇప్పుడు బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని మేకర్స్ నిర్ణయించగా, అందులో హీరోగా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ నటించనున్నారని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ లో రీమేక్ స్టార్ గా మంచి గుర్తింపు ఉంది.
సౌత్ లో హిట్ అయిన ఎన్నో సినిమాలను ఆయన ఇప్పటికే రీమేక్ చేశారు. కొంతకాలంగా సరైన హిట్ లేని అక్షయ్ కుమార్ ఇప్పుడు మళ్లీ సౌత్ ఇండస్ట్రీనే నమ్ముకుని ఈ సూపర్‌హిట్ ను రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో నిర్మించిన దిల్ రాజే హిందీలో కూడా నిర్మించనున్నారని, ఈ విషయంపై దిల్ రాజు ఇప్పటికే బాలీవుడ్ మేకర్స్ తో డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మూవీ దిల్ రాజుకు ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి.