లక్కీ హ్యాండ్‌గా మారిన సంజయ్ దత్
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మన దక్షిణాది డైరెక్టర్లకు లక్కీగా మారుతున్నాడు. కెజిఎఫ్2లో చేసిన అధీరా క్యారెక్టర్ కు మంచి పేరు రావడంతో ఆయన కోసం స్పెషల్ గా క్యారెక్టర్లను డిజైన్ చేస్తున్నారు దర్శకులు. రీసెంట్గా విజయ్ లియో సినిమాలో ఆయన పాత్రకు మంచి ఆదరణ లభించింది. అర్జున్ లాంటి సీనియర్ యాక్టర్ పక్కన కూడా సంజయ్ దత్ తన నటనతో మెప్పించాడు.
ఇప్పుడు కన్నడలో కేడీ డెవిల్ అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాలో కూడా సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇది కాకుండా టాలీవుడ్ లో ఇప్పటికే పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కలయికలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ లో కూడా సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. వీటితో పాటూ సంజయ్ దత్ టాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలో సంజయ్ దత్‌ను ఎంపిక చేశారని, దానికి సంబంధించిన లుక్ టెస్ట్ ఇప్పటికే ముంబైలో జరిగినట్లు చెప్తున్నారు. త్వరలో మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో సంజూ బాబా కూడా జాయిన్ కానున్నాడని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమా కోసం ఆయన ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారట.
ఇది కాకుండా చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర కోసం కూడా సంజయ్ దత్ ను అడగాలనుకుంటున్నారట. ఇదెంత వరకు నిజమన్నది మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు తెలియదు. మొత్తానికి సంజూ బాబాకు బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు లేకపోయినా ఇతర భాషల్లో ఆయనకున్న క్రేజ్ చూస్తుంటే మతి పోతుంది.













