క్రేజీ కాంబోలో సమంత
మూడేళ్ల ముందు వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత ఈ మధ్య సినిమాల్లో కనిపించడం పూర్తిగా తగ్గించేసింది. తనకు ఆఫర్లు రాక సినిమాలు ఓకే చేయడం లేదో, లేక వచ్చిన కథలు నచ్చడం లేదో తెలియదు కానీ చివరకైతే సమంత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తుంది. రీసెంట్ గా ప్రీ లుక్ పోస్టర్ తరహా రిలీజ్ చేశారు అంతకుమించి దాని గురించి మరే డీటెయిల్స్ తెలియదు.
వరుణ్ ధావన్ తో చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే అది లేటవుతూనే ఉంది. కరెక్ట్ టైమ్ చూసి ఈ ఏడాదిలోనే సిటాడెల్ ను స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్.
కేరళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో మమ్ముట్టి, సమంత కలిసి ఓ కమర్షియల్ యాడ్ కోసం నటించారు. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా రాబోతుంది. ఈ సినిమాను మమ్ముట్టి తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టి తక్కువ టైమ్ లోనే పూర్తి చేసేలా గౌతమ్ మీనన్ ప్లాన్ చేశాడట. క్రేజీ కాంబో కాబట్టి మలయాళంతో పాటూ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజయ్యే ఛాన్సుంది. మొన్నటివరకు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత ఆ గ్యాప్ ను బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టే ఆలోచన చేస్తున్నట్లు అనిపిస్తుంది.













