Samantha: తన హెల్త్ కండిషన్ పై సమంత ఏమంటుందంటే

మొన్నటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస పెట్టి సినిమాలు చేసిన సమంత(samantha) గత కొన్నాళ్లుగా స్పీడు తగ్గించిన సంగతి తెలిసిందే. దానికి రీజన్ ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటమే. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతూ, ట్రీట్‌మెంట్ లో భాగంగా సినిమాల నుంచి ఓ ఏడాది గ్యాప్ కూడా తీసుకుంది. బ్రేక్ తర్వాత సమంత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు కూడా సమంత వరుసగా సినిమాలు చేయడం లేదు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్న సమంత ఇప్పుడు బాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టింది. అయితే రీసెంట్ గా సమంత ఏ తెలుగు సినిమాకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. ఇటీవలే నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించి దాంతో మంచి హిట్ ను అందుకున్న సమంత తాజాగా తన హెల్త్ కండిషన్ గురించి మాట్లాడింది.
తాను మయోసైటిస్ నుంచి రికవర్ అవుతున్నానని, అలా అని పూర్తిగా కోలుకోలేదని, కానీ గతంలో కంటే చాలా బెటర్ గా ఉన్నానని ఆమె తెలిపింది. ఇప్పుడు తాను అన్ని విషయాలకు రెడీగా ఉన్నానని, ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయో తనకు తెలుసని సమంత చెప్పింది. ఈ సందర్భంగా తాను ఎక్కువ సినిమాలను చేయడం లేదనే విషయాన్ని కూడా ఒప్పుకున్న సమంత, త్వరలోనే తన నుంచి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ వింటారని, ఇప్పటికే వాటికి సంబంధించిన పనులు మొదలయ్యాయని ఆమె వెల్లడించారు.