Samantha: హెచ్సీయూ వివాదంపై స్పందించిన సమంత
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న సున్నిత అంశం హెచ్సీయూ(HCU) వివాదం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ కు ఆనుకున్న ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ కోసం నిర్మూలించడం ఎవరికీ ఇష్టం లేదు. ఆ భూమి యూనివర్సిటీకి సంబంధించినదని స్టూడెంట్స్ ఓ వైపు ఆందోళనలు చేస్తుంటే, ఆ 400 ఎకరాలు ప్రభుత్వం పరిధిలో ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం చెప్తోంది.
అటవీ నిర్మూలన చేయొద్దని ఎంతోమంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న టైమ్ లో సినీ నటి సమంత(Samantha) కూడా ఈ విషయంపై గొంతు విప్పింది. ఓ వైపు నిరసనలు జరుగుతున్నప్పటికీ 400 బుల్డోజర్లను రంగంలోకి దింపి ఆ ప్రాంతంలోని చెట్లను నరికేయడానికి చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన సమంత, చెట్లను నరికేయడం ద్వారా మరో 4 డిగ్రీలు ఉష్ణోగత్ర పెరిగే ఛాన్సుందని హెచ్చరిస్తోంది.
ఎన్నోరకాల అడవి జంతువులకు, పక్షులకు నిలయమైన అడవిని రక్షించాలని సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మాట్లాడిన సమంత ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ ఈ విషయంపై నాగ్ అశ్విన్(Nag Ashwin), తరుణ్ భాస్కర్(Tharun Bhascker), ప్రకాష్ రాజ్(Prakash Raj), రేణూ దేశాయ్(Renu Desai), ఈషారెబ్బా(Eesha Rebba) స్పందించగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది. ఇప్పుడు సమంతను చూసి మరింత మంది స్టార్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తారేమో చూడాలి.













