‘సకల గుణాభిరామ’ ఫస్ట్ లుక్ లాంచ్
విజేసన్నీ, ఆషిమా నర్వాల్, శ్రీతేజ్, తరుణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సకల గుణాభిరామ. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడు. సంజీవ రెడ్డి వడ్డి, శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్. రొమాన్స్, కామెడీ లాంటి అంశాలతో రూపొందిన చిత్రమిది. మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలన్నారు. హీరో వి.జే సన్నీ మాట్లాడుతూ నిర్మాత సంజీవ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడకుండా సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ తరుణిలు మాట్లాడుతూ మాకు ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన నిర్మాత సంజీవ రెడ్డి, మరియు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ వెలిగొండ గారికి మా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము అన్నారు. ఈ మూవీ సాంగ్స్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.













