Sailesh Kolanu: సైంధవ్ ఫ్లాపు తర్వాత ఆయన నన్నెంతో బాగా చూసుకున్నారు
హిట్వర్స్ లో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలు తీసి మంచి హిట్లు అందుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu). మధ్యలో శైలేష్ నుంచి విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా సైంధవ్(Saindhav) అనే సినిమా కూడా వచ్చింది. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ దీనిపై మాట్లాడుతూ, వెంకీతో తనకున్న బాండింగ్ గురించి తెలిపాడు.
వెంకీ(Venky)తో తీసిన సైంధవ్ సినిమా ఫ్లాపైనప్పటికీ వెంకటష్ కు, తనకు మధ్య మంచి బాండింగ్ ఉందంటున్నాడు శైలేష్. సైంధవ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు కొన్నాళ్ల పాటూ రోజూ వెంకీ నుంచి శైలేష్ కు ఫోన్ వెళ్లేదట. అలానే ఉండకు, లేచి పని చేసుకో. ఆఫీస్ కు వెళ్లి ఏదొకటి రాస్తూ ఉండు అని వెంకటేష్ చెప్పేవారని, కచ్ఛితంగా ఆయనతో మరో సినిమా చేసి మంచి హిట్ అందుకుంటానని చెప్పాడు శైలేష్.
వెంకీకి, తన కొడుక్కి మధ్య ఓ రకమైన ఫ్రెండ్షిప్ ఉందని, తన కొడుకు ప్రతీ రోజూ వెంకీకి తన ఫోన్ నుంచి ఐదారు వీడియోలు పంపుతూ ఉంటాడని, దానికి వెంకటేష్ కూడా రిప్లై ఇస్తుంటాడని, వారి మధ్య మంచి బాండింగ్ ఉందని, వెంకీ సర్ ఫ్యామిలీ మెంబర్ అని శైలేష్ చెప్పాడు. ఆల్రెడీ తామిద్దరం కలిసి మరో సినిమా చేయాలనుకున్నామని, దానిపై తాను వర్క్ చేయనున్నట్టు శైలేష్ తెలిపాడు.






