Nag Ashwin: ఆలియా ప్లేస్ లోకి సాయి పల్లవి?

కల్కి(kalki) సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్(nag ashwin), ఆ సినిమా హిట్ అవడంతో వెంటనే కల్కి2(kalki2) ను తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే కల్కి2 స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫినిష్ చేసి, ప్రభాస్(prabhas) డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో అనుకోకుండా దీపికా పదుకొణె(deepika padukone) ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో కల్కి2 మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
దీపికా ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలా అని మేకర్స్ ఆలోచిస్తుండగా, ఆ గ్యాప్ ను పూరించే లోపు నాగ్ అశ్విన్ ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాడట. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(alia bhatt) హీరోయిన్ గా నాగ్ అశ్విన్ ఓ సినిమా చేయబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కల్కి2 మరింత ఆలస్యం అవుతుండటంతో ఆ ప్రాజెక్టును ముందుకు జరపాలని చూస్తున్నాడట నాగి. కానీ ఆలియా భట్ తన గత కమిట్‌మెంట్స్ వల్ల బిజీగా ఉండటంతో ఆ సినిమాను సాయి పల్లవితో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. రామాయణ(ramayana) సినిమాతో నటిస్తుండటం వల్ల పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి(sai pallavi) అయితే ఈ సినిమాకు సరిపోతుందని భావించి, సాయి పల్లవితో డిస్కషన్స్ చేస్తున్నారని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందని అంటున్నారు.