Sai Pallavi: రొమాంటిక్ హీరోతో సాయి పల్లవి మూవీ?
తన టాలెంట్ తో తక్కువ కాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి(Sai Pallavi). ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలోని పాత్రలన్నీ వేటికవి స్పెషల్ పాత్రలే. సౌత్ లో తనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా కాకుండా చాలా సింపుల్ గా ఉంటుంది. మేకప్ వేసుకోదు, ఎక్స్పోజింగ్ చేయదు, తన సహజతనంతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసే సాయి పల్లవి సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.
సాయి పల్లవి ఇప్పటివరకు అసలు రొమాంటిక్ సీన్స్ చేసిందే లేదు. అలాంటి సాయి పల్లవి తాజాగా ఓ రొమాంటిక్ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. రాజ్ కుమార్ బాలకృష్ణన్(raj Kumar Balakrishnan) దర్శకత్వంలో శింబు(Simbhu) హీరోగా నటిస్తున్న STR49లో సాయి పల్లవి నటించనున్నట్టు సమాచారం.
డాన్ పిక్చర్స్ బ్యానర్(Don Pictures) లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న STR49ను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శింబు సినిమాలంటే ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













