డెవిల్కు ఎన్టీఆర్ మద్దతు అవసరమా?
కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాకు సంబంధించి జూ.ఎన్టీఆర్ ఇప్పటివరకు రెస్పాండ్ అవకపోవడం చూసి వారిద్దరి మధ్యలో ఏవో మనస్పర్థలొచ్చాయని అందరూ అంటున్నారు. కానీ అవన్నీ ఒట్టి మాటలేనని నందమూరి అన్నదమ్ముల బంధం ఎప్పటిలాగే రాక్ సాలిడ్ గా ఉందని సన్నిహితులు చెప్తున్నారు.
తారక్, తనకు కుదిరినప్పుడల్లా కళ్యాణ్ రామ్ సినిమాల ప్రీ రిలీజ్ కు అటెండ్ అయి సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. నిజం మాట్లాడుకుంటే ప్రతీసారి కళ్యాణ్ రామ్ ను ఎన్టీఆర్ ముందుండి నడిపించాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ వస్తేనే సినిమా హిట్ అవుతుందనుకుంటే అమిగోస్ సినిమా కూడా హిట్టవ్వాలి కానీ ఆ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాబట్టి డెవిల్ ప్రమోషన్స్ కు టైమ్ కేటాయించే పరిస్థితి లేదు. కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రమోషన్స్ లోకి దిగాడు. ఎంత ప్రమోట్ చేస్తున్నా సరే డెవిల్ కు బజ్ అనుకున్న స్థాయిలో పెరగట్లేదు. అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. దీంతో పాటూ అదే రోజున బబుల్గమ్ అనే సినిమా కూడా రిలీజవుతుంది కాబట్టి డెవిల్ కు సలార్ రూపంలో మరో ఇబ్బంది కూడా ఉంది. ఏదేమైనా డెవిల్ కు మంచి టాక్ వస్తే ఇవేవీ పెద్ద సమస్యలుగా కనిపించవు. మరి కళ్యాణ్ రామ్ డెవిల్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













