చైతూ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం 30 కోట్లా
ప్రస్తుతం నాగచైతన్య(naga chaitanya)- చందూ మొండేటి(Chandoo mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్(thandel) సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే చైతూ తన తర్వాతి సినిమాను విరూపాక్ష(Virupaksha) ఫేమ్ కార్తీక్ దండు(karthik Dandu)తో చేయనున్నాడు. ఆ సినిమా షూటింగ్ డిసెంబర్ 12 నుంచి మొదలుకానుంది.
మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఆడియన్స్ కు డిఫరెంట్ అనుభవాన్ని అందించనుందని సమాచారం. ఇందులో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి(meenashi chaudhary), పూజా హెగ్డే(pooja hegde) నటించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ సినిమాకు నిర్మాత బీవీఎస్ ప్రసాద్(BVSN PRasad) రూ.110 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఇందులో రూ.30 కోట్లను కేవలం విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు చేయనున్నారట. వీఎఫ్ఎక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ సినిమాను టాప్ రేంజ్ థ్రిల్లర్ గా మార్చాలని మేకర్స్ చూస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.













