RRRలో యాక్షన్ సీన్స్ వి.ఎఫ్.ఎక్స్ వీడియో అవుట్
సన్నివేశాలను ప్రేక్షకులు మెచ్చేలా ఉండటానికి వాటిని నిజంగా ఉండేలా చేయటంలో వి.ఎఫ్.ఎక్స్ ఎలాంటి పాత్రను పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRRలో అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి బ్రిడ్జ్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీన్. ఆ సన్నివేశంలో జక్కన్న వి.ఎఫ్.ఎక్స్‌ను ఎలా ఉపయోగించారో తెలియజేస్తూ RRR చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో చూస్తే థ్రిల్ అవుతారు. బాహుబలితో దేశం యావత్తు తన వైపు తిప్పుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి. దీంతో ఆయన తర్వాత చిత్రం ఎలా ఉంటుందనే అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలను మించేలా టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో RRR సినిమాను అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మాతగా RRR సినిమా అనేక సమస్యలను అధిగమించి ఈ ఏడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా పాన్ ఇండియా మూవీగా రిలీజై ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లను కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తన క్రియేటివిటీకి పదును పెట్టి హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందించారు.
సినిమాలో వి.ఎఫ్.ఎక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. సన్నివేశాలను ప్రేక్షకులు మెచ్చేలా ఉండటానికి వాటిని నిజంగా ఉండేలా చేయటంలో వి.ఎఫ్.ఎక్స్ ఎలాంటి పాత్రను పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRRలో అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి బ్రిడ్జ్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీన్. బ్రిడ్జ్ కింద ఉన్న నదిలోకి చేపలు పట్టడానికి ఓ చిన్న పిల్లాడు వెళతాడు. అయితే బ్రిడ్జ్‌పై వెళుతున్న ట్రెయిన్లో ఆయిల్ లీక్ కావటంతో పెద్ద ప్రమాదం జరిగి.. ఆ ట్రైన్ నీళ్లలో పడబోతుంది. కానీ మంటల మధ్య చిన్న పిల్లాడు చిక్కుకుంటాడు. దాంతో ఆ పిల్లాడిని కాపాడటానికి రామ్ – భీమ్ చేసే సాహసాన్ని అందరూ వెండితెరపై చూసే ఉంటారు. మరి ఆ సన్నివేశంలో జక్కన్న వి.ఎఫ్.ఎక్స్‌ను ఎలా ఉపయోగించారో తెలియజేస్తూ RRR చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది.అదే విధంగా ఎన్టీర్ అడవిలో ఇంట్రడక్షన్ సీన్ లో నీటిలో అడవి ప్రతిబింబించే సన్నివేశం ఎలా చిత్రీకరించారో దానికి సంబందించిన ఫోటోలు షేర్ చేసారు ఆ వీడియో చూస్తే థ్రిల్ అవుతారు.
Insta Video Links
https://www.instagram.com/p/
https://www.instagram.com/p/













