ఎన్టీఆర్ పుట్టిన రోజు ‘ఆర్ ఆర్ ఆర్’ స్పెషల్ వీడియో సిద్ధం!
ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు….నాడు ‘ఆర్ ఆర్ ఆర్’ స్పెషల్ ఏంటి? అంటే….. రాంచరణ్ పుట్టినరోజునాడు అల్లూరి పాత్రను పరిచయం చేస్తూ ఎన్టీఆర్అ వాయిస్ ఓవర్ తో అద్భుతమైన వీడియోను రిలీజ్ చేసారు . మరి ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఏదైనా స్పెషల్ ఉండాలి కదా! ఇక త్వరలో ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో పలకరించనుంది. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ లో కొమరం భీం పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదలనున్నారు. ఇప్పటికే వీడియోను సిద్ధం చేశారట. టీమ్ అంతా కూడా ఈ వీడియో పట్ల సంతృప్తికరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ వీడియో ఉంటుందని అంటున్నారు. ముందుగా చెప్పిన ప్రకారమే జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.ఇంకా కొన్ని రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలివుంది. లాక్ డౌన్ ఎత్తేయగానే మిగతా షూటింగు మొదలుకానుంది. మరి ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే వీడియో కి వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తారో చూడాలి.













