దిమ్మతిరిగే రేంజ్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం తమ ఫ్యాన్సే కాదు, యావత్ ప్రపంచమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివీయా మోరిస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీనికి తగ్గట్లుగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అతి భారీగా జరుగుతుందని తెలుస్తుంది.
ఇప్పటివరకు ఇండియా లో ఏ సినిమాకు జరగని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. మొత్తం మీద 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆర్ఆర్ఆర్ కు జరిగిందంటున్నారు. నైజాం లో 75 కోట్లు, ఆంధ్రా సీడెడ్ కలిపి 165 కోట్లు, తమిళనాడు లో 48 కోట్లు, కర్ణాటకలో 45 కోట్లు, కేరళలో 15 కోట్లకు ఈ సినిమా రైట్స్ ఇప్పటికే అమ్ముడు పోయాయట. పోతే హిందీ రైట్స్ 100 కోట్ల వరకు అమ్ముడుపోయిందని, ఓవర్సీస్ లో 70 కోట్ల బిజినెస్ అయిందని అంటున్నారు. అంతే కాదు శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా ఆర్ఆర్ఆర్ మంచి బిజినెస్ చేస్తుంది. ఒకే ఛానల్ అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు 225 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ అమ్ముడుపోని విధంగా ఈ సినిమా సేల్ అయిందని ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలవనుంది. ఇకపోతే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది.













