ఆర్ఆర్ఆర్ విడుదల తేదీలో మార్పు..
దర్శకుడు రాజమౌళి తన పందెంకోళ్లును వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దించడానికి నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలు గా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేయానుకుంటున్నట్లు ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత సినమా వాయిదా పడిరదనే వార్తు కూడా వినిపించాయి. తాజాగా ఈ సినిమాను జనవరి 8, 2021 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించాని మా టీమ్ అందరం కష్టపడుతున్నాం. వాయిదా పడటం నిరుత్సాహం కలిగించే వార్తే కానీ మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం అని ఆర్ఆర్ఆర్ బృందం ప్రకటించింది.













