నో డౌట్ జనవరి 8 రిలీజ్ రాజమౌళి సినిమానా…! మజాకా …!
లాక్ డౌన్ ప్రభావం అన్ని సినిమాలపై పడింది. చిన్న పెద్ద అన్ని సినిమాలు విడుదల తేదీలు మార్చుకునే పరిస్థితి, ఇప్పటికే షూటింగ్లు ఆగిపోవడంతో మళ్ళి ఆర్టిస్టుల కాల్ షీట్స్ సెట్ చేసుకోవడం రి-షెడ్యూల్స్ వేసుకోవడం జరుగుతుంది. షూటింగులు జరగాల్సిన సినిమాలను పక్కన పెడితే, ఇది వరకే రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు, మార్చ్ ఏప్రిల్ నెలలో విడుదల అవ్వాల్సిన మూవీస్ ఈ సమ్మర్ కి ఎప్పుడు ఎలా విడుదల అవుతాయో ఆ కరోనాకే తెలుసు. అయితే ఈ ఈబ్బంది ‘ఆర్.ఆర్.ఆర్’కి లేదట. రాజమౌళి దర్శకత్వంలోఎన్టీర్, రాంచరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేస్తామని లొక్డౌన్ ప్రకటించిన తరువాతే చిత్రబృందం రాంచరణ్ పుట్టినరోజున పోస్టర్ విడుదల చేసింది.
రాజమౌళి సినిమా, అందులోనూ… లాక్ డౌన్. దాంతో ఆర్.ఆర్.ఆర్ చెప్పిన సమయానికి రావడం కష్టమని సినీ అభిమానులు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. కానీ… లాక్ డౌన్ వల్ల ఈ సినిమా విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని చిత్రబృందం చెబుతోంది. అనుకున్న సమాయానికే ఈ సినిమాని విడుదల చేస్తార్ట. ఈ విషయంలో రాజమౌళి ఓ క్లారిటీతో ఉన్నాడని, నిర్మాత దానయ్య కీ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని 2021 జనవరి 8న ఎట్టి పరిస్థితులలో రిలీజ్ ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇది రాజమౌళి సినిమానా మజాకా…













