ఆర్ఆర్ఆర్ సీట్ ఎడ్జింగ్ క్లైమాక్స్ ఏంటో తెలుసా?
పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎంతో అద్భుతంగా టాలీవుడ్ తో పాటూ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ సినిమా పేరు మార్మోగేలా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ ఈ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చో బెడుతుందట. ఎగ్జయిట్ అయ్యి మరీ కళ్లప్పగించి చూస్తారని లీకులందాయి. సీతా రామరాజు (చరణ్), కొమరం భీమ్ (తారక్) తెల్ల దొరలు మల్ల యోధులపై భీకరంగా విరచుకుపడతారట. ఈ క్రమంలో భాగంగా ఒకరికి కళ్లు పోయి అంధకారంలోకి వెళ్తే ఇంకొకరికి కాళ్లు పోయి, నడవలేరు అయినా కానీ ప్రత్యర్థిని గెలవాలి.
దాని కోసం కళ్లు పోయిన సాయం కాళ్లు లేని వారికి, కాళ్లు లేని వారి సాయం కళ్లు పోయిన వారు తీసుకుని ఎలా వారితో పోరాడారన్నది బాగా రక్తి కట్టించేలా, ఎంతో కన్విన్సింగ్ గా షూట్ చేశారట రాజమౌళి. ఇది సినిమా హైలైట్స్ లలో ఒకటిగా నిలవనుందని చెప్తున్నారు. సీన్ లలోనే స్క్రీన్ ప్లే పీక్స్ లో ఉంటుందని, దీనికోసం విజయేంద్రుడు, రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ సీన్ ను ఎంతో కన్విన్సింగ్ గా చూపేందుకు చాలా కేర్ తీసుకుంటూ రోజుకు ఒకట్రెండు షాట్లు మాత్రమే తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అక్టోబర్ లో ఈ భారీ పాన్ ఇండియా చిత్రం రిలీజ్ కానుంది.













