అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా రోజా
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న `పుష్ప` సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నగిరి ఎమ్మెల్యే, నటి రోజా విలన్‌గా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత నెగెటివ్ క్యారెక్టర్ అయినా చెయ్యడానికి రోజా రెడీ అవుతున్నారని సమాచారం. ఈ క్యారెక్టర్ తనకు మంచి పేరు తెస్తుందని, తన కెరీర్ ఓ అద్భుతమైన పాత్రగా నిలుస్తుందని రోజా భావిస్తోందట. రోజా క్యారెక్టర్ కాకుండా ఈ సినిమాలో విలన్స్‌గా నటించేందుకు బాబీ సింహా, సునీల్ శెట్టి లను చిత్ర యూనిట్ సంప్రదించింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. లాక్డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగ్ జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రపదేశ్‌లోని మారేడుమిల్లి ప్రాంతంలో తాజా షెడ్యూల్ ప్రారంభిస్తారు. నిజానికి ఈ షెడ్యూల్‌ను మొదట థాయ్‌లాండ్, కేరళలో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా లొకేషన్‌ను షిఫ్ట్ చేశారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు ధనుంజయ్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ మొదట విజయ్ సేతుపతి చెయ్యాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ క్యారెక్టర్లోకి ధనుంజయ్ వచ్చాడు.













