Tollywood: టాలీవుడ్ సినిమాల ఇమేజ్ పెంచిన 2025
2025లో ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్బస్టర్లు అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి కూడా కనీసం కలెక్షన్లు కూడా అందుకోలేక ఫ్లాప్ అయ్యాయి. విడుదలకి ముందు వరకు బాగా క్రేజ్ ఉంది కూడా విడుదల తర్వాత మాత్రం డిజాస్టర్ గా నిలిచిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. మొత్తం విడుదలైన తెలుగు సినిమాలు ఏడాదికి సాధారణంగా 180`200 వరకు ఉంటాయి. అందులో 180 డైరెక్ట్ తెలుగు సినిమాలు కాగా, 20 తెలుగులో డబ్ చేసిన చిత్రాలు. మేము 2025 సంవత్సరంలో సినీ పరిశ్రమలో జరిగిన గుడ్ ఆర్ బాడ్ విషయాల గురించి కూడా సింహావలోకనం చేసుకుందాం.
కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు డిజాస్టర్ అయ్యి నష్టాల పాలు అయితే, తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు లాభాలు తెచ్చిపెట్టాయి. వివిధ భాషలలో నిర్మించిన ూుు సిరీస్‌లు, చిత్రాలు అన్ని భాషల్లోకి అనువదించడంతో ఇంట్లోనే వినోదాన్ని చూడాలనే ఆసక్తిని ప్రేక్షకులకు మరింత ఎక్కువైంది. వెబ్ సిరీస్ ల మేకింగ్, గేమ్ షోస్, వంటివి కూడా పెరిగాయి. దీంతో పాపులర్ సినిమా నటినటులు కూడా అటు వైపు ఆకర్షితులయ్యారు. ఈ సారి పాన్ ఇండియన్ సినిమా అంటూ నాలుగు అయిదు చిత్రాలు వచ్చినా జాతీయ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక పోయాయి.
2025లో టాప్ 10 చిత్రాలు ఇవే
2025లో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వసూళ్ల ఆధారంగా టాప్ టెన్ సినిమాలను పరిశీలిస్తే, ఈ విదంగా వున్నాయి. మన ఇండియన్ టాకీ సినిమా ‘భక్త ప్రహ్లద’ 1932లో విడుదలైంది. మళ్ళి ఇదే కథతో 93 ఏళ్ళ తరువాత ఇండియన్ స్క్రీన్‌పై 3D అనిమేషన్ సినిమాగా మహావతార్ నరసింహ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ గా 325 కోట్లు వసూళ్ళు చేసి టాప్ వన్‌గా నిలిచింది. 40 కోట్లతో నిర్మించిన ఈ అనిమేషన్ చిత్రం షుమారు 250 కోట్ల రూపాయలు, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘దే కాల్ హిమ్ ూG 300 కోట్ల రూపాయలు వసూల్ చేసి రెండవ స్థానంలో 50 కోట్ల రూపాయల ప్రాఫిట్‌తో నిలబడిరది. ఇదే హీరో నటించిన ‘హరి హర వీరమల్లు’ 114 కోట్ల రూపాయలు వసూల్ చేసి 9వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దిల్ రాజు నిర్మించి, వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ 50 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం 290 కోట్ల వరకు వసూల్ చేసి టాలీవుడ్‌కి మంచి లాభాలు తెచ్చి పెట్టిన చిత్రంగా నిలిచి మూడవ స్థానంలో నిలిచింది. ఇదే బ్యానర్లో అత్యంత ప్రతిస్తాత్మకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో, రామ్ చరణ్, మణిరత్నం కాంబిలో వచ్చిన ‘గేమ్ చెంజర్’ 195 కోట్ల రూపాయలు వసూల్ చేసి 4వ స్థానంలో నిలిచినా, సుమారు 300 కోట్ల రూపాయలు నష్టాన్ని చవి చూసింది. ఇక 5వ స్థానంలో నిలబడిన చిత్రం ‘మిరాయ్’ 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 150 కోట్ల రూపాయల వరకు వసూల్ చేసి సక్సెస్ మూవీగా నిలబడింది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ గరిష్టంగా 130 కోట్ల రూపాయలు వసూల్ చేసి 6వ స్థానంలో నిలబడిరది. అయితే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 100 కోట్ల వరకు వుంటుంది. 30 కోట్లతో లాభాల బాటలో వుంది. ఇక 7వ స్థానంలో నిలబడిన చిత్రం ‘హిట్ థర్డ్ కేస్’. హీరో నాని నటించి నిర్మించిన ఈ చిత్రానికి సుమారు 70 కోట్ల రూపాయల బడ్జెట్ అయినా, 120 కోట్ల రూపాయలు వసూల్ చేసి లాభాల్లో నిలబడిరది. అక్కినేని నాగార్జున, ధనుష్ లతో శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’ ఖర్చు ఎక్కువ రాబడి తక్కువతో 8వ స్థానంలో నిలిచింది. అది ఎలా అంటే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 145 కోట్ల వరకు వుంటుంది, కాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచేసరికి 135 కోట్ల రూపాయలు మాత్రమే వసూల్ చేయగలిగింది. ఇక 10వ స్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం, గీతా ఆర్ట్స్ బ్యానర్లో అక్కినేని నాగచైతన్య నటించిన ‘తండేల్’ ఓ 15 కోట్ల రూపాయల లాభంతో సక్సెస్ అయింది.
టాలీవుడ్ చిత్రాల నెలవారిగా విడుదలలు జయాపజయాలను పరిశీలిద్దాం
జనవరి: ఈ నెలలో చిన్న పెద్ద 15 చిత్రాలవరకు విడుదల అయ్యాయి. ముఖ్యంగా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్స్ చిత్రాలు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ ఏడాది కూడా దిల్ రాజు నిర్మించిన వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ చెంజర్’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రాలు విడుదల అయ్యాయి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘డాకు మహారాజ్’ ఈ నెలలో కేవలం రెండు చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి మిగతా 13 చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
ఫిబ్రవరి: ఈ నెలలో చిన్న పెద్ద 14 చిత్రాలవరకు విడుదల అయ్యాయి. వీటిలో తండేల్ చిత్రం మాత్రం నిలబడి మిగతా అన్ని చిత్రాలు పరాజయం పాలయ్యా యి. హీరో విశ్వక్సేన్ విభిన్నంగా ప్రయత్నించిన ‘లైలా’ డిజాస్టర్ అయ్యింది.
మార్చి: ఈ నెలలో భారీ సంఖ్యలో షుమారు 22 చిత్రాలవరకు విడుదల అయ్యాయి. మార్చ్ నెలాఖరులో విడుదల అయిన ‘మ్యాడ్ స్వ్కేర్’ హిట్ అయ్యింది. ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రానికి మంచి ప్రశంసలు లబించాయి. నితిన్ చిత్రం రాబిన్ హుడ్ ఫ్లోప్ అయ్యింది. ఈ నెలలో 22 చిత్రాలకు గాను ఒకే ఒక్క ‘మ్యాడ్ స్వ్కేర్’ తప్పించి ఏ చిత్రం థియేటర్లలో నిలబడలేకపోయాయి.
ఏప్రిల్: సమ్మర్ స్టార్టింగ్‌లో విడుదలైన తమన్నా ఓదెల 2, నందమూరి కళ్యాణ్ రామ్ విజయ శాంతిల ‘అర్జున్ సన్ అఫ్ వైజయంతి’, సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రాలు ప్రేక్షకుడిని నిరాశ పరిచాయి. ఈ నెలలో విడుదలైన 16 చిత్రాలలో 15 చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
మే: మే మాసం అంటేనే సమ్మర్ స్పెషల్ బిగ్ స్టార్స్ నటించే చిత్రాలు విడుదల అవుతుంటాయి కాని మినిమం బడ్జెట్‌తో తీసిన మిడిల్ రేంజ్ హీరోల చిత్రాలు విడుదల అయ్యాయి. మే 1న విడుదలైన ఒకే ఒక చిత్రం విజయం సాధించింది. అది హీరో నాని నటించి నిర్మించిన ‘హిట్ :థర్డ్ కేస్’. ఈ చిత్రానికి సుమారు 70 కోట్ల రూపాయల బడ్జెట్ అయినా, 120 కోట్ల రూపాయలు వసూల్ చేసి లాభాల్లో నిలబడిరది. మే నెలలో 17 చిత్రాల వరకు విడుదల అయ్యాయి. 16 చిత్రాలు ప్లాప్‌లు చవి చూసాయి.
జూన్: ఈ నెలలో చిన్న పెద్ద 7 చిత్రాలే విడుదల అయ్యాయి. అయితే ఈ నెల ఆఖరులో విడుదలైన కుబేర, కన్నప్ప చిత్రాలు మినహా మిగతా అయిదు చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో మోహన్ బాబు నిర్మించి, మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి కాని కలెక్షన్స్ లేవు. జూన్ 20న విడుదలైన అక్కినేని నాగార్జున, ధనుష్‌లతో శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’ ఖర్చు ఎక్కువ రాబడి తక్కువతో 8వ స్థానంలో నిలిచింది. అది ఎలా అంటే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 145 కోట్ల వరకు వుంటుంది, కాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచేసరికి 135 కోట్ల రూపాయలు మాత్రమే వసూల్ చేయగలిగింది.
జూలై: ఈ నెల లో 17 సినిమాలు విడుదలైనా వాటిలో గుర్తించబడే నితిన్ ‘తమ్ముడు’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకో లేక పోయాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు, మహాఅవతార్ నరసింహ, చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడినవి. మిగతా 15 డిజాస్టర్ అయ్యాయి.
ఆగష్టు: ఆగష్టు నెలలో అత్యధికంగా 14 చిత్రాలు విడుదల అయ్యాయి. ఈ నెలలో విడుదలైన ఈ చిత్రం ఆడలేదు.
సెప్టెంబర్: సెప్టెంబర్ నెలలో 8 చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాలు అనుష్క శెట్టి ఘాటి, బెల్లం కొండ శ్రీనివాస్ ‘కిష్కింద పూరి’ ‘మిరాయి’ పవన్ కళ్యాణ్ ‘దే కాల్ హిం %ూG%’ అయితే వీటిలో సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ‘కిష్కింద పూరి’ ‘మిరాయి’ సెప్టెంబర్ 12న విడుదలైన ‘దే కాల్ హిం %ూG%’ సక్సెస్ మూవీస్ నిలిచాయి.
అక్టోబర్: ఈ నెలలో 11 చిత్రాలు విడుదల అయినా సక్సెస్ అయిన చిత్రాలు కిరణ్ అబ్బవరం కే-రాంప్, బాహుబలి : ది ఎపిక్ ‘ మంచి కలెక్షన్స్ సాధించాయి. ఇక రవి తేజ మాస్ జాతర, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా? వంటి చిత్రాలు థియేటర్లలో నిలబడలేకపోయాయి.
నవంబర్: ఈ నెలలో విడుదలైన 25 సినిమాలలో రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తప్పించి మిగతా 24 చిత్రాలన్నీ పరాజయం పాలైయ్యాయి.
డిసెంబర్: ఈ నెలలో విడుదల తేది ప్రకటించిన 13 చిత్రాలలో ఈ వ్యాసం ప్రింట్ అయ్యేనాటికి అఖండ 2, మోగ్లీ 2025 రెండు చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో స్వప్న సినిమా ‘ఛాంపియన్, శివాజీ దండోరా, ఆది సాయికుమార్ ‘శంభాల’ చిత్రాలు.













