Mammo0tty: కెరీర్ మొదలుపెట్టిన పదేళ్లకు గుర్తింపు
మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న మమ్ముట్టి(mammo0tty) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలకు గానూ ఆయన్ను రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ బిరుదుతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
తన అసలు పేరు మమ్ముట్టి కాదని, మహ్మద్ కుట్టి(Mohammad kutty) అని, దాన్ని పిలవడం రాక తన ఫ్రెండ్ మమ్ముట్టి అని పిలవడంతో అది అలా మారిపోయిందని, తాను చండీరూర్ లో పుట్టినప్పటికీ కొట్టాయాంలోనే చదువుకున్నానని, ఎర్నాకులంలో లా చదివి, అక్కడే ప్రాక్టీస్ట్ కూడా మొదలుపెట్టినట్టు చెప్పారు. ప్రాక్టీస్ చేస్తూనే సినిమాలపై ఉన్న ఆసక్తితో సినీ అవకాశాల కోసం ట్రై చేసినట్టు చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రెండేళ్ల పాటూ ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో ప్రాక్టీస్ ను పూర్తిగా వదిలేసి ట్రై చేశానని, మొదట్లో ఎక్కడికి వెళ్లినా తిరస్కరించేవారని, కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చిందని, అలా ఏడెనిమిదేళ్ల పాటూ చిన్న చిన్న పాత్రలు చేశానని, తర్వాత హీరోగా అవకాశం వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయిందని, ఆ తర్వాత మరోసారి హీరో ఛాన్స్ వచ్చిందని, అలా కెరీర్ మొదలైన పదేళ్లకు కానీ తనకంటూ ఓ గుర్తింపు రాలేదని మమ్ముట్టి చెప్పారు.













