Tollywood: టాలీవుడ్ అప్‌కమింగ్ రీరిలీజ్ సినిమాలు!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రీరిలీజులు ఎక్కువైపోయాయి. కేవలం హిట్టు, బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రమే కాకుండా ఫ్లాపు సినిమాలను కూడా కల్ట్ సినిమాలుగా మార్చి వాటిని కూడా రీరిలీజ్ చేసి ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ అవగా ఇప్పుడు మరికొన్ని సినిమాలు రీరిలీజులకు రెడీగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
అర్జున్(Arjun), జగపతి బాబు(jagapathi babu) ప్రధాన పాత్రల్లో మోహన్ రాజా(mohan raja) దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ జంక్షన్(hanuman junction) సినిమా 2001లో రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమా జూన్ 28న రీరిలీజ్ కాబోతుంది. రాజ్ తరుణ్(raj tharun), హెబ్బా పటేల్(hebah patel) జంటగా నటించిన కుమారి 21 ఎఫ్(kumari 21F) సినిమా జులై 10న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రవితేజ(raviteja), హరీష్ శంకర్(Harish Shankar) కలయికలో వచ్చిన సూపర్ హిట్ సినిమా మిరపకాయ్(mirapakay) జులై 11న రీరిలీజ్ కానుండగా, సూర్య(suriya) హీరోగా మురుగదాస్(Murugadoss) దర్శకత్వంలో వచ్చిన గజినీ(Gajini) తెలుగు డబ్బింగ్ వెర్షన్ జులై 18న రీరిలీజ్ అవబోతుంది. నాగచైతన్య(naga chaitanya), సమంత(samantha) జంటగా గౌతమ్ మీనన్(Gautham menon) దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ ఏ మాయ చేసావె(ye maya chesave) జులై 18న రీరిలీజ్ అవుతుంది. వీటితో పాటూ సూర్య వీడొక్కడే(Veedokkade) జులై 19న రీరిలీజ్ కాబోతుంది. మరి వీటన్నింటిలో ఏ సినిమా రీరిలీజుల్లో హిట్ అవుతుందో చూడాలి.