రవితేజ క్రేజ్ మారడం ఖాయమే!
వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రూపంలో హిట్ అందుకున్న రవితేజ, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్టువర్ట్ పురానికి చెందిన ఓ నిజ జీవిత దొంగ కథతో ఈ సినిమా తెరకెక్కింది.
రవితేజ కెరీర్ లో రాబోతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ముంబైలో లాంఛ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా తర్వాత రవితేజ రేంజ్ మారడం ఖాయంలా కనిపిస్తుంది. స్టువర్ట్ పురం అనే దొంగలకు ప్రసిద్ధి చెందిన ఊరిలో పూర్వం ఎవరు దొంగతనం చేయాలన్నా వేలం పాట పాడుకుని మరీ చేసేవారు.
అలాంటి కోవకు చెంది నాగేశ్వరరావు వేరే వారు చేసిన కుట్రల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జైలుకు వెళ్లాక నాగేశ్వరరావు కాస్తా టైగర్ నాగేశ్వరరావుగా మారి ఏకంగా సీఎం, పీఎంలు ఆలోచించే రేంజ్‌కు వెళ్తాడు. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. రవితేజ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఈ దసరాకు రవితేజ టైగర్ నాగేశ్వరరావు తో హిట్ అందుకునేలానే ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.













