పుష్ప2లో ఛాన్స్ ను వదులుకున్న రవికృష్ణ
సీరియల్స్ లో స్టార్ నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రవికృష్ణ. కానీ సినీ రంగంలో మంచి పొజిషన్ కు వెళ్లాలని మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో బుల్లితెరకు స్వస్తి పలికాడు రవి. మెల్లగా సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలందుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు రవికృష్ణ. బిగ్ బాస్ సీజన్3 లో టాప్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచిన రవి ఆ తర్వాత సీరియల్స్ కు పూర్తిగా దూరమయ్యాడు.
అనుభవించు రాజా అనే సినిమాలో మొదటిగా ఛాన్స్ అందుకున్న రవితేజ, ఆ తర్వాత విరూపాక్ష సినిమాలో విలన్ పాత్రలో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. రీసెంట్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో కూడా నటించాడు. అంతేకాదు రవి కీలక పాత్రలో నటించిన లవ్ మి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
లవ్ మి సినిమా తర్వాత తనకు మరిన్ని అవకాశాలొస్తాయని నమ్ముతున్న రవి, ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. లవ్ మి సినిమా కోసం పుష్ప2 సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాడట రవి. పుష్ప2లో ఓ పాత్ర కోసం సుకుమార్ టీమ్ రవిని సంప్రదించారట. కానీ లవ్ మి సినిమా కు అడ్జస్ట్ చేసిన డేట్స్ తో క్లాష్ రావడంతో పుష్ప2 వదులుకున్నట్లు చెప్పిన రవి, ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడం వల్ల ఛాలా ఫీలైనట్లు చెప్పుకొచ్చాడు.













