Ravi Basrur: రవి బస్రూర్ ఖాతాలో మరో హిట్టు
కెజిఎఫ్(KGF) సినిమాతో సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు రవి బస్రూర్(Ravi Basrur). ఒక యాక్షన్ డ్రామాకు మంచి బీజీఎం ఇస్తే ఎలాంటి ఎలివేషన్ ఉంటుందో దానికి మించిన బీజీఎం ఇచ్చి ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. సలార్1(Salaar1)లో కూడా రవి బస్రూర్ మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. అయితే ప్రశాంత్ నీల్(Prasanth Neel) కు తప్ప మరెవరికీ రవి గొప్ప అవుట్పుట్ ఇవ్వడనే విమర్శ అతనిపై ఉంది.
ఆ విమర్శకు తగ్గట్టే ఆయన మధ్యలో వర్క్ చేసిన మార్టిన్(Martin), భీమా(Bheema), జీబ్రా(Zeebra) సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మార్కో(Marco) సినిమాతో రవి బస్రూర్ పేరు మళ్లీ వినిపిస్తోంది. ఓ మామూలు గ్యాంగ్స్టర్ రివెంజ్ డ్రామాకు అతనిచ్చిన బీజీఎం గొప్ప ప్రశంసలందుకుంటుంది. మార్కో సినిమాకు రవి బస్రూర్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా ప్లస్ అయింది.
రవి బస్రూర్ తన రొటీన్ స్టైల్ ను పక్కన పెట్టి కథలో ఇంటెన్సిటీని అర్థం చేసుకుని ఇచ్చిన అవుట్పుట్ అందరినీ మెప్పిస్తోంది. మొత్తానికి మార్కో సినిమా ద్వారా రవి అకౌంట్ లో మరో హిట్ పడింది. దీంతో ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. దానికి కారణం ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తుండటమే. షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలయ్యే అవకాశముంది. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం.













