Rashmika Mandanna: ప్రభాస్ తో సినిమా చేయాలనుంది
వరుస సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా(rashmika mandanna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ఈ ఇయర్ రష్మిక నుంచి నాలుగు సినిమాలు రాగా, నవంబర్ 7న ది గర్ల్‌ఫ్రెండ్(the girlfriend) రాబోతుంది. రాహుల్ రవీంద్రన్(rahul ravindran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ లో రష్మిక యాక్టివ్ గా పాల్గొంటుంది.
ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక రీసెంట్ గా ఎక్స్ వేదికగా చాట్ సెషన్ ను నిర్వహించగా అందులో రష్మిక కు డిఫరెంట్ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చిన రష్మిక ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. చాట్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ నుంచి రష్మికకు ప్రభాస్(prabhas) తో ఎప్పుడు సినిమా చేస్తారనే ప్రశ్న ఎదురైంది.
దానికి రష్మిక రియాక్ట్ అవుతూ, ప్రభాస్ తో కలిసి నటించడం తనకు కూడా ఇష్టమేనని, ప్రభాస్ సర్ ఈ మెసేజ్ లు చూస్తారని ఆశిస్తున్నా, తామిద్దరూ కలిసి ఫ్యూచర్ లో సినిమా చేస్తే అది చాలా స్పెషల్ గా నిలుస్తుందని రష్మిక చెప్పింది. ఇప్పటివరకు రష్మిక కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేయగా, ప్రభాస్ తో మాత్రం ఇంకా సినిమా చేయలేదు. మరి రష్మిక కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.







