రష్మికకు గోల్డెన్ ఛాన్స్
తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేసే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ఈ చిత్ర కథానాయకిని కూడా ఎంపిక చేసేశాడు. సాయిపల్లివి పేరు కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరికి రష్మికకు ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఫ్యాన్స్ కూడా సాయిపల్లవి కంటే రష్మిక అయితేనే బాగుంటుందని అభిప్రాయపడి ఉండడం విశేషం. మహర్షి విడుదలై, ఆ సినిమా ప్రమోషన్ కోసం కొన్ని రోజులు కేటాయించి.. ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు మహేష్‌బాబు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు.













