నేషనల్ రేంజ్ లో రష్మిక క్రేజ్..
డిజిటల్ యుగంలో సౌత్ లో చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో నేషనల్ లెవల్ ఐడెంటిటీ సంపాదిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయి ఫాలోయింగ్ వస్తుంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ హోదా దక్కింది. 2020 సంక్రాంతి బరిలో మహేష్ కు జతగా సరిలేరు నీకెవ్వరు లో నటించి జాతీయయ స్థాయి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక అప్పటి నుంచి రష్మిక ను నేషనల్ లెవల్ లో క్రేజ్ తగ్గట్లేదు. ఇప్పటికీ గూగుల్ లో బాగా ట్రెండ్ అవుతూనే ఉంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా రష్మిక సత్తా చాటుకుంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తక్కువ స్థాయిలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఛాన్సులు దక్కించుకుంటుంది రష్మిక.
వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన రష్మిక గత నాలుగు రోజులుగా ఏ రీజన్ లేకుండానే నేషన్ రేంజ్ లో ట్విట్టర్ లో టాప్ ట్రెండ్ లో ఉండటం చూస్తుంటే తన ఫాలోయింగ్ అర్థమవుతుంది. ఒక వైపు బన్నీ సరసన పుష్ప లో నటిస్తున్న రష్మిక మరో వైపు అమితాబ్ నటిస్తున్న ఒక బాలీవుడ్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇదంతా తన ప్రతిభతోనే రష్మిక సాధించుకుందని, అందుకే గూగుల్ లో ఈ అమ్మడుని వెతికే వాళ్లు ఎక్కువయ్యారని అనుకోవచ్చు.













